| సేంద్రియ ఎరువులు | రసాయనిక ఎరువులు |
| ü ప్రకృతి పరమైన వృక్ష , జంతు అవశేషాలు . ü అన్ని పోషకాలను అందిస్తాయి, కాని తక్కువ పరిమాణాల్లో అందిస్తాయి. ü పోషకాల విడుదల, సరఫరా నెమ్మదిగా మరియు దీర్ఘ కాలికం గా ఉంటుంది. ü పోషకాల విలువలు నిర్దిష్టం గా వుండవు ü పోషకాలు నేలకు వేసిన వెంటనే మొక్కలు సంగ్రహించుకోలేవు . ü సేంద్రియ ఎరువుల వాడకం వలన Ø నేల ఆకృతి మెరుగు పడుతుంది Ø స్థూల సాంద్రత తగ్గుతుంది Ø నీరు ఇంకే గుణం, నీటిని నిలువరించే గుణం ఎక్కువ అవుతుంది. Ø మురుగు నీరు పోయే సామర్ద్యం పెరుగుతుంది. Ø నీరు ఆవిరి గా మారడం (evaporation)తగ్గుతుంది. Ø నేలకోత, పోషకాల వృధా తగ్గుతాయి ü నేలలో సూక్ష్మ జీవుల సేంద్రియ పదార్ధాలను ఆహారం గా వాడుకొని జీవిస్తాయి. ü సమస్యాత్మక నేలలు గా మార్చ బడవు. సమస్యల నివారణకు వాడుతారు. ü సేంద్రియ ఎరువులు కృళ్ళే టప్పుడు అనేక ఆమ్లాలు తయారవడం వల్ల అనేక పోషకాలు లభ్య రూపం లోనికి మారి మొక్కలకు అందజేయబడతాయి. ఉదా: భాస్వరం ü ఎక్కువ పరిమాణాలలో (టన్నుల్లో) వేసుకోవాలి ü పంట విత్తుటకు 15 – 30 రోజుల ముందుగా నేలలో కలియ దున్నాలి. | ü ఖనిజ లవణాలు (చాల వరకు కృత్రిమంగా తయారు చేయబడిన రసాయనాలు ü పోషక పరిమాణము ఎక్కువ. ఒకటి నుండి మూడు పోషకాలు మాత్రమే అందించేటట్లు తయారు చేయబడినవి. ü నిర్దిష్ట పోషక పరిమాణం కలిగి ఉంటుంది. ü పోషకాలను వెంటనే సంగ్రహించు కొంటాయి. ü రసాయనాల వలన నేల భౌతిక, రసాయన మార్పులు కలిగి నేల ఆరోగ్యం చెడుతుంది. ü సూక్ష్మ జీవులు కొంత మేరకు ఆహారం గా వాడుకొన్నా వాని జీవనాధారానికి ప్రధానమైనవి కావు. ü అధికం గా వాడడం వలన సమస్యాత్మక నేలలు గా మారుతాయి. ü వీటి వలన నేలలోని పోషకాలు రూపాంతరం చెందవు. ü తక్కువ పరిమాణాలలో (కిలోలలో) సరిపోతుంది. ü అవసరాన్ని బట్టి ఎప్పుడైనా వాడుకోవచ్చు. |
Saturday, June 25, 2011
సేంద్రియ ఎరువులు మరియు రసాయన ఎరువుల మధ్య తేడాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment