Saturday, June 25, 2011

నేల సారం X నేల ఉత్పాదకత

1. నేల సారం  X  నేల ఉత్పాదకత
నేల సారం: నేలలో గల స్థూల, సూక్ష్మ పోషకాల పరిమాణాన్నే తెలుపుతుంది గాని వాటి లభ్యత తెలియదు.
నేల ఉత్పాదకత: నేల యొక్క పంట దిగుబడి శక్తిని తెలియజేస్తుంది. నేల ఉత్పాదకత  నేల సారం తో బాటు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆ అంశాలు సూక్ష్మం గా ఈ క్రింద తెలియజేయబడినవి.
  1. నేల ఉదజని సూచి: ఉదజని సూచి తటస్థ స్థాయిలో ఉన్నపుడు అన్ని పోషక పదార్ధాలు సమ స్థాయి లో మొక్కలకు అందజేయబడతాయి.ఉదజని సూచి తగ్గినా (ఆమ్ల నేలలు)పెరిగినా (క్షార నేలలు) కొన్ని పోషక పదార్ధాలు అందవు. లేదా అత్యధిక పాళ్ళలో కరిగి మొక్కలకు విష తుల్యం గా మారుతాయి.
  2. నేల రచన : నీటిని మరియు నేలకు వేసిన పోషక పదార్దాలను నిలుపుకునే శక్తి నేల రచన ఫై ఆధారపడి ఉంటుంది. తేలిక నేలల్లో పోషక పదార్ధాలు ముఖ్యం గా నత్రజని నేల అడుగు పొరల లోనికి పోయి మొక్కల వ్రేళ్ళ కు అందదు . అదే విధం గా నేలలో అధిక మోతాదులలో బంకమన్ను ఉన్న కొన్ని పోషక పదార్దాలను గట్టి గా పట్టి ఉంచి మొక్కలకు విడుదల కావు.
  3. నేల నిర్మాణం: నేల ఉత్పాదకత నేల ఆకృతి పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నేల ఆకృతి/ నిర్మాణం వల్ల స్థూల, సూక్ష్మ రంధ్రాలు సమ స్థాయిలో ఉండడం వల్ల మొక్కల పెరుగుదల దానితో బాటు దిగుబడి పెరుగుతుంది. మంచి ఆకృతి గల నేలలో సూక్ష్మ జీవుల పెరుగుదల, దాని వల్ల భౌతిక, రసాయన, జీవ సంబంధ చర్యలు మెరుగుపడి సేంద్రియ పదార్ధం  మార్పు చెంది హ్యూమస్ గా మారి, CEC ని పెంచుతుంది. దాని వల్ల అన్ని పోషక పదార్ధాలు పంటకు లభిస్తాయి.
  4. నేలలో గాలి ప్రసరణ (aeration): వేర్ల పెరుగుదల, పోషకాల లభ్యత, సూక్ష్మ జీవుల సంఖ్య, మినిరలైజేషన్ మొదలైనవి నేలలో గాలి ప్రసరణ పై ఆధారపడి వుండును.
  5. మురుగు నీరు పోవు సౌకర్యం (drainage): మురుగు నీరు పోవు సౌకర్యం లేనపుడు నేలలో గాలి లేకపోవడం వల్ల ఇమ్మోబిలైజేషన్ మరియు వేర్లు పోషకాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడును.
  6. C:N ratio: (కర్బన నత్రజని నిష్పత్తి): సూక్ష్మ జీవుల పెరుగుదల, సేంద్రియ పదార్దం చివికే ప్రక్రియ, చివికిన సేంద్రియ పదార్దం హ్యూమస్ గా మారడం- దానివల్ల CEC అధికమై మొక్కలకు హెచ్చు పరిమాణాలలో పోషక పదార్ధాలు అందజేయబడతాయి.
  7. సూక్ష్మ జీవులు: సేంద్రియ పదార్ధ లభ్యత పై సూక్ష్మ జీవుల పెరుగుదల ఆధార పడడమే కాకుండా మినిరలైజేషన్ వల్ల అధిక పోషక పదార్ధాలు మొక్కలకు అందజేయ బడతాయి.
  8. సేంద్రియ ఎరువులు: రసాయనిక ఎరువుల సామర్ధ్యం నేలలో గల సేంద్రియ ఎరువులపై ఆధారపడి వుంటుంది.
  9. సమస్యాత్మక నేలలు: చౌడు భూములు, ఆమ్ల నేలలు, లోతు లేని నేలలు, మురుగు నీరు పోవు సౌకర్యం లేని నేలలు- సారవంతమైన పోషక పదార్ధాలన్నీ తగు పరిమాణాలలో మొక్కలకు అందక ఉత్పాదకత తగ్గుతుంది.

No comments:

Post a Comment