Saturday, June 25, 2011

గాఢ సేంద్రియ ఎరువులు


గాఢ /  సాంద్రీకృత సేంద్రియ ఎరువులు
(concentrated organic manures)
·         సేంద్రియ స్వభావము కలిగి యుండి ఎక్కువ శాతం నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి  స్థూల పోషకాలు మరియు ఇతర పోషకాలు సరఫరా చేసే ఎరువులను సాంద్రీకృత  / గాఢ సేంద్రియ ఎరువులు అంటారు.
·         ఈ ఎరువుల విభజన ప్రక్క పటములో ఇవ్వ బడినది.
·         సాంద్రీకృత  సేంద్రియ ఎరువులు మెత్తగా పొడి చేసి పంట విత్తే ముందు ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి.
·         ఈ ఎరువులు స్థూల సేంద్రియ ఎరువుల కన్నా త్వరగా విచ్చిన్నమై పోషకాలు నేలలోకి విడుదల చేస్తాయి.
మొక్కల సంబంధిత సాంద్రీకృత సేంద్రియ ఎరువులు:

తినదగినవి (edible cakes): మానవ , పశు ఆహారం గా ఉపయోగ పడతాయి. ఉదా: కొబ్బరి పిండి, నువ్వుల పిండి , వేరుసెనగ పిండి

తినదగనివి (non edible)  : ఉదా: ఆముదపు పిండి, ఆవ పిండి, కానుగ పిండి, కుసుమ పిండి, ప్రత్తి గింజల పిండి, వేప పిండి ఎరువు గా ఉపయోగించెదరు.

  • ప్రస్తుతం వేప పిండి ఎక్కువ గా వ్యవసాయం లో వాడుతున్నారు. దీనివల్ల ముఖ్యం గా మొక్కలకు హాని కలిగించే      నెమటోడ్స్ ను నివారించ వచ్చు.
  • పంటలకు పిండి వేసినప్పుడు అడవి పందులు వాసన పసిగట్టి పంటలను నాశనము చేయును.
జంతు సంబంధ సాంద్రీకృత సేంద్రియ ఎరువులు:
1.      రక్తాహారము(blood meal):
జంతు వధశాలల్లోసేకరించబడిన రక్తాన్ని పూర్తిగా ఎండబెట్టి చూర్ణం గా చేసి అన్ని రకాల నేలల్లో వాడవచ్చు. ఈ ఎరువు నేలలో తొందరగా చివికి మొక్కలకు పోషకాలను అందిస్తుంది.
2.      ఎముకల పొడి (Bone meal):
వివిధ జంతువుల ఎముకలను పొడిగా చేసి నేలలో కలుపు తారు. ఎముకలను నీటి ఆవిరిలో ఉడక బెట్టినచో త్వరగా చూర్ణము చేసుకొనవచ్చును. అంతేగాక ఇలా తయారు చేసిన ఎముకల పొడి నేలలో త్వరగా విచ్చిన్నమగును.ఆమ్ల గుణము గల నేలలకు ఈ ఎముకల పొడిని వాడిన పి. హెచ్( pH) ఎక్కువయి తటస్థ pH కి చేరును.ఎముకల పొడిలో ఎక్కువగా కాల్షియం ఉండటం వలన మొక్కలకు తగినంత కాల్షియం అందించ బడుతుంది.

3.      చేపల ఎరువు: (Fish meal):
తినడానికి పనికి రాని చేపలు, చచ్చిన, క్రుళ్ళిన చేపలను ఎండబెట్టి చూర్ణము చేసి ఎరువు గా వాడుతారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఈ ఎరువుల లభ్యత ఎక్కువ.
కొన్ని చేపలనుండి నూనె తీసి ఆ తరువాత కళేబరాలను ఎండబెట్టి చూర్ణము గా చేసి ఎరువుగా వాడుతారు.

4.      కొమ్ములు మరియు గిట్టల ఆహారము (Horn meal)
కొమ్ములు, గిట్టలు ఎండబెట్టి చూర్ణము గా వాడుతారు. ఇది నెమ్మదిగా నత్రజని ని విడుదల చేస్తుంది.

5.      గ్వానో: (Guano)
అత్యంత శీతల ప్రాంతాలయిన ఉత్తర ధృవ సముద్ర తీరాల్లో ఉన్న సముద్ర పక్షులు (pelicans, seals) సముద్ర తాబేళ్ళు విశేషం గా లభ్యమయ్యే చేపలను ఆహారం గా తీసుకొంటాయి. ఆ పక్షుల విసర్జనలు గుట్టలుగా ఏర్పడతాయి. చలి వాతావరణం లో త్వరగా చివక డానికి వీలు లేక గుట్టలు గా ఏర్పడే ఈ పదార్ధాన్ని గ్వానో (guano) అంటారు. దీనిని గాఢ గంధకికామ్లము (sulphuric acid) తో కలిపి గ్వానో ఎరువు గా వాడుతారు.

No comments:

Post a Comment