Saturday, June 25, 2011

సమగ్ర సస్య పోషణ

సమగ్ర సస్య పోషణ
(Integrated Nutrient Management)
  • మన పూర్వీకులు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా నేల ఆరోగ్యాన్ని, సారాన్ని పరిరక్షించి నాణ్యమైన దిగుబడులు సాధించారు.
  • భారతదేశ జనాభా పెరుగుదల – వారి ఆహార అవసరాల నిమిత్తం-శాస్త్రవేత్తల కృషి ఫలితం గా తక్కువ కాలం లో ఎక్కువ దిగుబడినిచ్చే సంకర రకాల ఆవిర్భావం – దానితో బాటు ఎక్కువ పోషకాలు గల రసాయనిక ఎరువులు వాడకం తో మంచి దిగుబడులు సాధించాము.
  • రైతులు విచక్షణా రహితం గా రసాయన ఎరువు వాడడం ప్రారంభించడం మొదలు పెట్టారు.
  • ఆర్ధిక, సామాజిక మార్పుల వలన రైతులు పశుపోషణ, సేంద్రియ వ్యర్ధాల సమీకరణ తగ్గడం వలన వ్యవసాయం పూర్తిగా రసాయనిక ఎరువులు, కీటక నాసిను లపై ఆధార పాడడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి వ్యవసాయానికి పెను ముప్పు ఏర్పడే పరిస్థితి ఉద్బవించింది..
  • ప్రస్తుత పరిస్థితులను దృష్టి లో పెట్టుకొని భూసార పరిరక్షణకు శాస్త్రజ్ఞులు, అనుభవం గల రైతులు కృషి చేసి తత్ఫలితం గా “సమగ్ర సస్య పోషణ” అనే విధానాన్ని ప్రవేశపెట్టారు.
సమగ్ర సస్య పోషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం:
మొక్కకు కావలసిన వివిధ పోషకాలను సేంద్రియ మరియు రసాయనిక ఎరువులను తగు పాళ్ళలో వాడుకుని, పర్యావరణాన్ని పరి రక్షించు కుంటూ అధిక దిగుబడులు సాధించడమే సమగ్ర సస్య పోషణ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
సమగ్ర సస్య పోషణ లో పరిగణన లోనికి తీసుకొనే అంశాలు:
·         నేలలో పోషకాల పరిమాణ స్థాయి.
·         సేంద్రియ ఎరువుల ద్వారా అందే పోషకాలు
·         రసాయనిక ఎరువుల ద్వారా అందే పోషకాలు
·         నేల నుండి వృధా అయ్యే పోషకాలు
·         వేసే పంట పోషక అవసరాలు.
ముఖ్య ఉద్దేశ్యాలు: (Goals of INM)
  • నేల ఉత్పాదకత (soil productivity) పెంచడం
  • అనుకూల, ప్రతికూల వాతావరణ పరిస్థితులలో వ్యవసాయం లాభసాటి గా ఉండేటట్లు రూప కల్పన చేయడం
  • రసాయన ఎరువుల వాడకం మరియు వాటి ఖర్చు కొంత మేరకు తగ్గించడం
  • ప్రాంతీయం గా (locally) లభ్యమయ్యే సేంద్రియ వనరులను, పచ్చి రొట్ట ఎరువులను, జీవన ఎరువులను సమ్మర్ధవంతం గా వినియోగించుకోవడం
  • పర్యావరణ పరి రక్షణకు తోడ్పడడం
  • సహజ వనరులను నష్టపరచకుండా రైతుల ఆర్ధిక స్థితిని మెరుగు పరచడం.
సమగ్ర సస్య పోషణ లో భాగాలు:(Components of INM)
1)      సేంద్రియ ఎరువులు
2)      వ్యవసాయ వ్యర్ధాలు
3)      జీవన ఎరువులు
4)      రసాయనిక ఎరువులు
1). సేంద్రియ ఎరువులు :
పశువుల ఎరువు, కంపోష్టు, హరిత మొక్కల ఎరువు, హరిత ఆకుల ఎరువు వివిధ రకాల గాఢ సేంద్రియ ఎరువులు, (oil cakes), జంతు సంబంధిత సేంద్రియ ఎరువులు (బ్లడ్ మీల, బోన్ మీల, హార్న్ మీల్ మొదలైనవి)

2). వ్యవసాయ వ్యర్ధాలు:
వ్యవసాయ వ్యర్ధాలు-పంట కోసిన తర్వాత మిగిలిన మోళ్ళు, పశువుల మేతకు పనికి రాని వ్యర్ధాలు, చెరకు ఆకులు మొదలైనవి.

3). జీవన ఎరువులు:
రైజోబియం, ఎజటో బాక్టర్ , క్లాస్ట్రీడియం, ఎజో స్పైరిల్లం, ఎసిటో బాక్టర్  వంటి నత్రజని స్థిరీకరించు జీవులు, బెసిల్లాస్, సూడో మోనాస్ , ఎస్పర్జిల్లస్, పెన్సిలియం మొదలైన భాస్వరం కరిగించే సూక్ష్మ జీవులు

4). రసాయనిక ఎరువులు:
నత్రజని, భాస్వరపు, పొటాష్ మరియు సూక్ష్మ పోషక పదార్ధాలను అందించే రసాయనిక ఎరువులు

సమగ్ర సస్య పోషణ లో అవరోధాలు (constraints in INM)
  1. రైతు స్థాయిలో పశు పోషణ సన్న గిల్లి పశువుల ఎరువు లభ్యత లేకపోవడం
  2. పచ్చి రొట్ట ఎరువులకు సరైన ఆదరణ లేదు. దాని బదులు మరొక పంట పండించవచ్చు అన్న కారణం చే పచ్చి రొట్ట పైరుల ప్రాధాన్యత తగ్గింది.
  3. జీవన ఎరువులు అందు బాటులో లేకపోవడం మరియు వాటిపై సరైన అవగాహనా లేక పోవడం
  4. మట్టి పరీక్షలు దాని ఆధారిత సిఫారసు కార్యక్రమాలు లోప భూయిష్టం కావడం
  5. పెరిగి పోతున్న రసాయన ఎరువుల ఖరీదు
  6. సాగునీటి కొరత
  7. సమస్యాత్మక భూములు
  8. శాస్త్రీయ పరిజ్ఞానం, ఋణ సదుపాయం సక్రమంగా అందక పోవడం.

సమగ్ర సస్య పోషణ – లాభాలు:
  1. నేల సారం, ఉత్పాదకత పెరుగును
  2. నేల భౌతిక, రసాయన, జీవ పరమయిన లక్షణాలు మెరుగు పడతాయి
  3. నీరు ఇంకే గుణం (infiltration), నీరు నిల్వ ఉంచుకునే గుణం (water holding capacity), మురుగు నీరు పోవు సౌకర్యం (drainage) మెరుగు పడతాయి.
  4. పోషకాల లభ్య రూపం లోకి మారే ప్రక్రియ (mineralization), పోషకాలు వృధా కాకుండా నిల్వ ఉంచుకునే గుణం (ion exchange) పెరుగు తాయి.
  5. నేలలో వచ్చే మార్పులను నిరోధించే శక్తి (buffering capacity) పెరుగుతుంది.
  6. రసాయన ఎరువుల సామర్ధ్యం (fertilizer use efficiency) పెరుగుతుంది.
  7. రసాయన ఎరువుల మీద పెట్టుబడి 30 శాతం వరకూ తగ్గించ వచ్చు.
  8. నేల కాలుష్యం, భూ గర్భ జలాల కాలుష్యం తగ్గుతుంది.

No comments:

Post a Comment