Saturday, June 25, 2011

కంపోస్టు

కంపోస్టు:
వ్యవసాయ, గృహ, పట్టణ సేంద్రియ వ్యర్ధాలు ఒక పధ్ధతి లో  కృళ్ళేటట్లు చేసి వాటి పరిమాణం తగ్గించి విలువైన ఎరువు గా తయారు చేయడాన్ని కంపోస్టింగు అంటారు

కంపోస్టు ఎందుకు చేయాలి దాని వల్ల లాభాలు:
·         వ్యవసాయ, గృహ, పట్టణ వ్యర్ధాలను ఉపయోగించి వ్యవసాయానికి పనికి వచ్చే ఎరువు గా వాడుకోవచ్చు.
·         ప్రత్యేక శ్రద్ద, నైపుణ్యం అవసరం లేదు.
·         పెద్ద పట్టణాలు , నగరాలలో పేరుకు పోతున్న చెత్తను సద్వినియోగ పరచ వచ్చు
·         వ్యర్ధ పదార్ధాలు పేరుకు పోకుండా చేయడం వల్ల సూక్ష్మ జీవుల వల్ల వచ్చే జబ్బుల నుండి నివారణ
·         వ్యర్ధ పదార్ధాలలో C : N నిష్పత్తి తగ్గించి అతి విలువైన సేంద్రియ పదార్ధాన్ని తయారుచేసి వ్యవసాయాభివృద్ధి కి వినియోగించవచ్చు
·         కలుపు విత్తనాలు క్రుళ్ళడం వల్ల మొలకెత్తవు
·         వ్యర్ధాలు ఆక్రమించే స్థలాన్ని తగ్గించ వచ్చు.
కంపోస్టు ప్రక్రియను నియంత్రించే అంశాలు (Factors affecting compost process)
  • సేంద్రియ వ్యర్ధాల భౌతిక, రసాయనిక స్థితులు
  • కంపోస్టు దిబ్బలో గాలి ప్రసారం (aeration)
  • కంపోస్టు దిబ్బలో తేమ శాతం
  • ఉష్ణోగ్రత
  • పి హెచ్ (PH)
  • సమయము
  • క్రుళ్ళడానికి ఉపయోగపడే సూక్ష్మ జీవుల లభ్యత

బాక్టీరియా:
బాసిల్లస్ బ్రూయిస్ (Bacillus brewis)
బాసిల్లస్ సర్కులాన్స్ (Bacillus circulans)
బాసిల్లస్ కోయాగులాన్స్ (Bacillus coagulans)
బాసిల్లస్ సబ్టిలిస్ (Bacillus subtilis)

ఆక్టినో మైసిట్స్:
నొకార్డియా          (Nocardia)
థర్మోఎక్టినో మైసిటీస్ వుల్గారిస్ (Thermo actino mycetes vulgaris)
స్ట్రెపో  మైసిటిస్    (Streptomycetes rectus)
థర్మనోస్పోరా       (Thermonospora)

శిలీంద్ర జాతి :
మ్యుకార్                        (Mucar)
కీటో మియం       (chetomium)
థర్మోఫైలం           (Thermo phylum)
పెన్సీలియం         (Pencillium)
ఎస్పర్జిల్లస్           (Aspergillus)

  • కంపోస్టు దిబ్బలో తగినంత తేమ ఉండేటట్లు  చేయాలి
  • ఆల్కహాల్ తయారీలో వ్యర్ధం గా మిగిలిన ఈస్ట్ స్లడ్జ్(yeast sludge) ని కుళ్లడానికి ఉపయోగించ వచ్చు.


కంపోష్టు రకాలు

  1. గ్రామీణ కంపోష్టు
  2. పట్టణ కంపోష్టు

గ్రామీణ కంపోష్టు:
  • సుమారు ఆరు అడుగుల లోతు, పన్నెండు అడుగుల వెడల్పు మరియు యాభై అడుగుల పొడవు గల గుంటలో వివిధ గ్రామీణ ప్రాంత వ్యర్ధ పదార్ధాలను ఒక అడుగు మందం లో పరచు కోవాలి.
  • గ్రామీణ ప్రాంత వ్యర్ధాలు: గృహాల్లో ఆహార వ్యర్ధాలు, వ్యవసాయ వ్యర్ధాలు, పశువుల శాల లో పేడ , మూత్రము, మూత్రము తో నానిన గడ్డి మొదలైనవి.
  • వ్యవసాయ వ్యర్ధాలు: కలుపు మొక్కలు, పైరు మోళ్ళు( crop stubbles) , పొట్టు లేదా ఊక (bhusa, straw, shells etc), పైర్ల వ్యర్దాలైన చెరకు ఆకు, ప్రత్తి కంప, వేరు శనగ పొట్టు, ఇతర వ్యర్ధాలు, పశువుల మూత్రం తో నానిన మట్టి, పశువుల విసర్జనలు వాడుతారు.
  • వ్యర్దాలను పేడ నీటితో బాగా తడుపుతారు.
  • ఈ విధం గా నేల మీద 5 అడుగులు వచ్చే వరకు క్రమ పద్ధతులలో వ్యర్ధాలను పేర్చుకొంటూ వచ్చి ఆ తరువాత గుంత ను మట్టి తో కప్పుతారు.
  • మూడు నెలల తర్వాత క్రుళ్ళిన వ్యర్ధాలను బయటకు తీసి గుట్ట గా పోసి అవసరం మేరకు నీటితో తడిపి మళ్ళీ మట్టి తో కప్పుతారు.
  • మూడు నెలల తర్వాత క్రుళ్ళిన ఈ వ్యర్ధాలను బయటకు తీసి ఎరువు గా వాడుతారు.
  • పశువుల పేడ ఎక్కువగా వేసిన కృళ్ళే ప్రక్రియ వేగవంతమగును .


పట్టణ కంపోష్టు:
  • పట్టణ ప్రాంత వ్యర్ధాలను వాడి కృళ్ళేటట్లు చేయగా తయారయిన ఎరువును పట్టణ కంపోష్టు అంటారు.
  • పట్టణ ప్రాంత నివాసాలకు దూరం గా (కనీసం ఒకటిన్నర కి. మీ) పల్లపు ప్రాంతాలలో గాని లేదా వ్యర్ధాల లభ్యతను బట్టి అనువైన ప్రాంతం లో అనువైన కొలతలతో గుంత త్రవ్వుకొని పట్టణ వ్యర్ధాలను క్రమ బద్ధం గా పేర్చు కోవాలి.
  • గృహాలలోని వ్యర్ధాలు, వీధులలోని చెత్త, చేదారము, వివిధ పరిశ్రమల వ్యర్ధాలు, ఇతర వ్యర్ధాలు నిత్యమూ పట్టణ పారిశుధ్య విభాగము(sanitary dept) ప్రోగు చేసి పట్టణ సరిహద్దులకు తరలించెదరు .వీటిని క్రమ బద్దం గా గుంత లో విస్తరింప చేయుదురు.
  • ఒక అడుగు మందములో వ్యర్ధాలను పేర్చిన తరువాత దాని మీద క్రుళ్ళడానికి మానవ విసర్జనలు (గ్రామీణ కంపోష్టు లో వాడే పశువుల పేడ కు బదులుగా) వాడుదురు.
  • ఈ విధం గా పొరలు పొరలు గా పట్టణ వ్యర్ధాలు, మానవ విసర్జనలు పరచుకొంటూ నేల మీదకు కొంత ఎత్తు వరకు గుట్ట గా చేయాలి.
  • ఈ గుట్టలు కప్పకుండా వదిలి వేసిన ఆక్సిజన్ సమక్షం లో (aerobic decompositon)క్రుళ్ళు తాయి. గుట్టలు కప్పి వేసినపుడు ఆక్సిజన్ లేకుండా (anaerobic decomposition) కృళ్ళే కార్యక్రమం జరుగుతుంది.
  • పట్టణ కంపోష్టు నుండి వెలువడే దుర్గంధాన్ని (foul smell) నివారించుటకు మరియు ఈగల (flies) బెడద నివారణ కు కాపర్ సల్ఫేట్ జల్ల వలెను.
  • పట్టణ కంపోష్టు తయారీ కి అనేక పద్ధతులు ఉన్నాయి.
Ø  ADCO  పధ్ధతి
Ø  బెంగళూరు పధ్ధతి
Ø  ఇండోర్ పధ్ధతి
Ø  కోయంబత్తూర్ పధ్ధతి
  • పధ్ధతి ని బట్టి వాడే ముడి పదార్ధాలు మారును. ఉపయోగించే సేంద్రియ పదార్ధాలు ఒకే రకమయినప్పటికి క్రుళ్ళ డానికి వాడే ముడి పదార్దములు మారును. ఈ ముడి పదార్ధాలు కృళ్ళే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.
  • ఉదా: అమ్మోనియం సల్ఫేట్, సున్నము, బొగ్గుపొడి, యూరియా, ఎముకల పొడి, నూనె పిండి
  • ఎరువు దిబ్బలో తేమ ఉండేటట్లు చూచు కోవడం చాలా అవసరం
  • ఎరువు 3-4 నెలల్లో తయారవుతుంది.

1 comment:

  1. Села Напротодальна Рго протодальна Рго
    Села Напротодальна titanium chloride Рго протодальна Рго womens titanium wedding bands Тпотодальна Рго titanium mens wedding bands Тпотодальна titanium glasses Рго Тпотодальна apple watch titanium Рго

    ReplyDelete