Saturday, June 25, 2011

రసాయన ఎరువులు


రసాయన ఎరువులు
CHEMICAL FERTILIZERS

          నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ముఖ్య పోషకాలు మరియు ఇతర పోషకాలు ఆంగిక భాగాలు గా కలిగి వుండి, కృత్రిమంగా  తయారు చేయ బడిన లేదా రూపాంతరము చేయబడిన రసాయన పదార్ధాలను రసాయన ఎరువులు అంటారు.
          రసాయనిక ఎరువులు 1నుండి 3 ప్రధాన పోషకాలను అధిక పరిమాణాలలో కలిగి నేలలో వేయగానే త్వరగా కరిగి మొక్కల కందించ బడుతాయి.
రసాయనిక ఎరువుల వర్గీకరణ
          రసాయనిక ఎరువులో గల ముఖ్య పోషకాహారాన్ని బట్టి మూడు విధాలు గా వర్గీకరించారు.
          1. సూటి ఎరువులు (straight fertilizers)
          2. మిశ్రమ ఎరువులు (mixed fertilizers)
          3. సంకీర్ణ ఎరువులు (complex fertilizers)

సూటి రసాయనిక ఎరువులు
          సూటి ఎరువులో ప్రధాన పోషకాన్ని బట్టి మరల ఈ క్రింది విధం గా వర్గీకరించవచ్చు
  1. నత్రజని ఎరువులు
  2. భాస్వర ఎరువులు
  3. పొటాషియం ఎరువులు
  4. ద్వితీయ పోషక ఎరువులు
  5. సూక్ష్మ పోషక ఎరువులు

No comments:

Post a Comment